Pushpa2| ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోల పాటలకి డ్యాన్స్ లు చేస్తూ తెగ సందడి చేశాడు. లాక్‌డౌన్ సమయంలో అలా వైకుంఠపురంలో చిత్రంలోని పాటలు, డైలాగ్‌లకు రీల్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఆ తరువాత పుష్ప సినిమాలో పలు డైలాగ్‌లతో పాటు శ్రీవల్లి పాటకు వార్నర్ డ్యాన్స్ చేసి అదరహో అనిపించాడు. ఇక ఇప్పుడు పుష్ప2 సినిమాలోని షూ డ్రాప్ హుక్ స్టెప్ వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే ఆ స్టెప్ వేసేందుకు తనకు కొంత సమయం పడుతుందని వార్నర్ కామెంట్ చేయగా, దానికి బన్నీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇక అల్లు అర్జున్ ఈ పాటలో హుక్ స్టెప్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ షూ డ్రాప్ స్టెప్ ని ఎంజాయ్ చేయాలంటూ కోరాడు. దానికి డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఈ స్టెప్ చాలా బాగుంది.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది. దీన్ని తొందరగా నేర్చుకోవాలి అంటూ డేవిడ్ వార్నర్ కామెంట్ పెట్టగా,దానికి బన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.
ఇది చాలా ఈజీ స్టెప్ డేవిడ్. ఈ సారి మనం కలిసినప్పుడు తప్పక నేర్పిస్తాను అంటూ బన్నీ కామెంట్ పెట్టాడు. ఇక వార్నర్‌కి ఇంత ఆసక్తి ఉండడంతో ఆయనకి పుష్ప2లో ఓ కామియో రోల్ ఇప్పించొచ్చు కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైన సరే ఈ సారి పుష్ప2తో అల్లు అర్జున్ ప్రభంజనాలు సృష్టించనున్నాడని అర్ధమవుతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతుంది.
View this post on Instagram