సామూహిక వివాహ వేడుకలో నీతా అంబానీ..
ముంబై: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి పెద్దగా సమయం లేదు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌తో జూలై 12 న వివాహం జరగనుంది. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం.. ఆపై పెళ్లి పత్రిక.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్. ప్రతిదీ సామాన్యుడు నోరు వెళ్లబెట్టేలాగే ఉన్నాయి. రెండు ప్రి వెడ్డింగ్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఆ తరువాత అంబానీ కుటుంబం సామూహిక వివాహాలను జరిపించింది. దీనిలో భాగంగా 50 జంటలకు వివాహం జరిపించింది. ఈ సామూహిక వివాహ వేడుకలకు అంబానీ కుటుంబమంతా హాజరైంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించారు.