Monday, December 30, 2024
HomeSportsAmbati Rayudu| కోహ్లీని విమ‌ర్శించిన అంబ‌టి రాయుడు..ఫ్యామిలీకి హ‌త్యాచార బెదిరింపులు

Ambati Rayudu| కోహ్లీని విమ‌ర్శించిన అంబ‌టి రాయుడు..ఫ్యామిలీకి హ‌త్యాచార బెదిరింపులు

Ambati Rayudu| టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి చాలా రోజులు అవుతున్నా కూడా ఆయ‌న ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నాడు. కొన్ని సార్లు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు. అయితే ఇటీవ‌ల అంబ‌టి రాయుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో పాటు కోహ్లీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. చెన్నై సూపర్ కింగ్స్ ని ఎప్పుడైతే ఆర్సీబీ ఓడించిందో అప్పటి నుంచి తన నోటికి పని చెబుతూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా ఐపీఎల్ టైటిల్ గెలవలేరు అంటూ డైరెక్ట్ గా విరాట్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించాడు ఈ మాజీ క్రికెట‌ర్

ప్లే ఆఫ్స్ చేరితేనే టైటిల్ గెలిచిందనే రీతిలో ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు. వరుసగా ఆర్‌సీబీనే టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో రాయుడిపై ఆ జట్టు అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. జుగుప్సాకరమైన రీతిలో రాయుడిని బండ బూతులు తిట్టారు. మ‌రి కొందరైతే అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని, రాయుడు భార్య, పిల్లలపై లైంగిక దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్‌ పాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోలీసులను కోరాడు.

ప్రతి వ్యక్తికి రాజ్యంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. అయితే వాటిని కొంత మందికాలరాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు, న్యాయవ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ రాయుడు ఫ్రెండ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. క్రికెట్‌లో విమ‌ర్శ‌లు అనేవి కామ‌న్. దానికే ఫ్యామిలీని టార్గెట్ చేసి.. బెదిరించడం కరెక్ట్ కాదని కొంత మంది రాయుడికి అండ‌గా నిలుస్తూ కామెంట్ చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎలా స‌మసిపోతుందా అనేది చూడాలి

RELATED ARTICLES

తాజా వార్తలు