Anand Mahindra | ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వస్తుంటారు. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఎప్పటికప్పుడు ఆసక్తికర పోస్టులు పెడుతూ వస్తుంటారు. తాజాగా ఆయన మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదోదశ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసిన గిరిజన వ్యక్తి ఫొటోను ఆయన షేర్ చేశారు.
This, for me, is the best picture of the 2024 elections.
One of seven of the Shompen tribe in Great Nicobar, who voted for the first time.
Democracy: it’s an irresistible, unstoppable force. pic.twitter.com/xzivKCKZ6h
— anand mahindra (@anandmahindra) May 20, 2024
తనకు సంబంధించి 2024 ఎన్నికల్లో బెస్ట్ పొటో ఇదేనంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని అటవీ ప్రాంతంలో నివసించే షోంపెన్ తెగకు చెందిన ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా ప్రజాస్వామ్యానికి ఎదురులేదని.. తిరుగులేని శక్తి అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్‌గా మారింది. సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆనంద్ మహ్రీందా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మనలను ఎవరు పాటించాలో నిర్ణయించుకునే అవకాశమని.. ఇది ఓ బ్లెస్సింగ్.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్టూ ట్వీట్‌లో కోరారు.