Monday, December 30, 2024
HomeSportsAnasuya|ఐపీఎల్ మ్యాచ్‌లో అన‌సూయ సంద‌డి..కేక లుక్‌లో క‌నిపించిందిగా..!

Anasuya|ఐపీఎల్ మ్యాచ్‌లో అన‌సూయ సంద‌డి..కేక లుక్‌లో క‌నిపించిందిగా..!

Anasuya| గ‌త రాత్రి హైద‌రాబాద్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజ‌యం సాధించ‌డం విశేషం.స‌న్‌రైజర్స్ హైదరాబాద్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత‌మైన బౌలింగ్‌తో హైద‌రాబాద్‌కి విజ‌యం ద‌క్కింది అని చెప్పాలి. చివ‌రి బంతికి వికెట్ తీసి త‌మ జ‌ట్టుకి సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాడు భువి. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్)తో పాటు హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించ‌డంతో హైద‌రాబాద్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది.

ఇక ల‌క్ష్య చేధ‌న‌లో ఆర్ఆర్ జ‌ట్టు 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), రియాన్ పరాగ్(49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) అద్భుతంగా రాణించారు. దాదాపు మ్యాచ్‌ని గెలిపించే ప్ర‌య‌త్నం చేశారు. కాని స‌న్‌రైజర్స్ అద్భుత‌మైన బౌలింగ్‌తో విజ‌యం వారికే ద‌క్కింది. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమైన ద‌శ‌లో కమిన్స్ వేసిన 19వ ఓవర్‌లో ధ్రువ్ జురెల్ ఔట‌య్యాడు. క‌మిన్స్ వేసిన ఓవ‌ర్‌లో ఏడుగులు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో చివ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్థాన్‌కి 13 ప‌రుగులు అవ‌స‌రం అయింది.

భువనేశ్వర్ కుమార్ ఆఖ‌రి ఓవ‌ర్ వేయ‌గా, అందులో రోవ్‌మన్ పోవెల్ ఓ బౌండరీతో పాటు క్విక్ డబుల్స్ తీయడంతో.. ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ అద్భుమైన బంతితో పోవెల్‌ను ఔట్ చేసి త‌మ జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాలీవుడ్ హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తెగ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరైన అనసూయ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెల‌పుతూ తెగ హంగామా చేసంది. గ్యాల‌రీలో ఒకటే హ‌డావిడి చేసింది. ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్‌లో రియాన్ పరాగ్ సిక్స్ కొట్టగా.. లాంగాన్‌లో అబ్దుల్ సమద్ క్యాచ్‌కు ప్ర‌య‌త్నించిన అది అంద‌లేదు. ఆ స‌మ‌యంలో అన‌సూయ ఇచ్చిన రియాక్ష‌న్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు