Andhagan: ఎట్టకేలకు థియేటర్లలోకి ప్రశాంత్ ‘అందగన్’
ఆరేండ్ల క్రితం బాలీవుడ్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘అంధధూన్’. దానిని ఇప్పటికే తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో రిమేక్ చేసి విడుదల కూడా చేశారు. అయితే అదే సమయంలో తమిళంలోనూ ప్రశాంత్ హీరోగా ‘అందగన్’ పేరుతో మొదలు పెట్టారు. ప్రశాంత్ తండ్రి ప్రముఖ డైరెక్టర్ త్యాగరాజన్ తన సొంత నిర్మాణ సంస్థ స్టార్ మూవీస్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. అయితే చాలాకాలం తర్వాత ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ ‘అందగన్’ చిత్రంలో హిందీలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను ప్రశాంత్ చేస్తుండగా రాధికా ఆప్టే పాత్రలో ప్రియా ఆనంద్, టబు పాత్రను సిమ్రాన్ చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో కార్తీక్ , యోగిబాబు, ఊర్వశి, కేఎస్ రవికుమార్, మనోబాలా, వనిత విజయకుమాన్, సెమ్మలర్, పూవైయార్ తదితరులు నటించారు. రవియాదవ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.