YS Jagan | కడప : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంతో ఉన్నారు. ఏడు గంటల కంటే ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప నియోజకవర్గంలోని జయమహల్ అంగన్ వాడీ సెంటర్(పోలింగ్ బూత్ నంబర్ 138)లో జగన్ ఓటు వేశారు.
కడప ఎంపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ సుబ్బరామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలో ఉన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గత ఐదేండ్ల నుంచి మీరు వైసీపీ పాలన చూస్తున్నారు. మీరు వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారని భావిస్తే, ఉజ్వల భవిష్యత్తుకు దారితీసే మా పాలనకు ఓటు వేయండి అని ఏపీ ప్రజలను జగన్ కోరారు.
#WATCH | Kadapa: Andhra Pradesh CM YS Jagan Mohan Reddy shows his inked finger after casting his vote at Kadapa Constituency’s Jayamahal Anganawadi Polling Booth No. 138.#LokSabhaElections2024 pic.twitter.com/HMSu65RrUa
— ANI (@ANI) May 13, 2024