Anjali| తెలుగింటి సీతమ్మగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి ఒకప్పుడు హీరోయిన్‌గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పించింది. ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌తో అలరిస్తుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలలో నటిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నేహా శెట్టి కథానాయిక కాగా, అంజలి ఒక కీలక పాత్రలో నటించి మెప్పించనుంది. అయితే గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అంజలి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలో తన పాత్ర రత్నమాల అని చెప్పిన అంజలి తన పాత్ర గత సినిమాలకి భిన్నంగా ఉంటుందని తెలియజేసింది.
అయితే ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఈ సినిమా కోసం బూతులు మాట్లాడాల్సి వచ్చింది. రియల్ లైఫ్‌లో ఎప్పుడు బూతులు వాడను. కాని రత్నమాల పాత్ర కోసం దర్శకుడు నన్ను సంప్రదించినప్పుడు బూతులు మాట్లాడాలి అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అయితే అంజలి ఇప్పటికే ప్రూవ్డ్ యాక్టర్. ఎలాంటి క్యారెక్టర్ అయిన ఈజీగా చేయగలదు. అందుకే ఇలాంటి పాత్రలో అంజలిని తీసుకున్నట్టు డైరెక్టర్ కృష్ణ చైతన్య బదులిచ్చాడు. గోదావరి స్లాంగ్ లో చాలా రఫ్ గా అంజలి పాత్ర ఉండబోతుందని వారి మాటలని బట్టి అర్ధమవుతుంది. ఈ సినిమా హిట్ అయి అంజలి పాత్రకి మంచి పేరు వస్తే ఇక ఈ అమ్మడి జోరు ఓ రేంజ్‌లో ఉంటుంది.
గేమ్ చేంజర్ మూవీలో అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. వింటేజ్ రామ్ చరణ్ కి జోడీగా అంజలి నటిస్తుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. సుట్టంలా సూసి పోకలా, మోత పోగిపోద్ది పాటలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో విశ్వక్ సేన్ చివరిగా గామి చిత్రంతో మంచి హిట్ కొట్టాడు.అఘోరా పాత్రలో కనిపించి అదరగొట్టాడు. ఇక విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రం చేస్తున్నాడు. నటుడిగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్‌గా కూడా విశ్వక్ సేన్ సత్తా చాటుతున్నాడు.