వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) గారు 1కోటి రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారికి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు.