విజయవాడ: ఆయన ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనో క్యాష్ పార్టీ అని, గిమ్మిక్కులు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నామని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఐ-ప్యాక్ నిర్మాణాత్మకంగానే ఉందని అనుకుంటున్నామన్నారు. ప్రశాంత్ కిషోరైనా, ఐ-ప్యాక్ అయినా తాత్కాలికమని, వైసీపీ శాశ్వతమని చెప్పారు.
కో-ఆర్డినేషన్ కోసం ఐ-ప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని వెల్లడించారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయి.. నిర్ణయం తీసుకోవాల్సింది మేమేనన్నారు. ఐ-ప్యాక్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవమని అన్నారు. ఐ-ప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవమని చెప్పారు. వారు ఓ జాబితా ఇచ్చారని, అందులో నుంచి అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసుకుందని స్పష్టం చేశారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై చాలా క్లారిటీగా ఉన్నామని.. 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని నమ్ముతున్నామన్నారు. తాము మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు. జగన్ అడిగిన విధంగా మోదీ కూడా ధైర్యంగా ఓట్లడగలేకపోతున్నారని తెలిపారు. పరిపాలన చూసి ఓటేయండని ప్రధాని కూడా అడగలేకపోయారని గుర్తుచేశారు. దేశానికి మేలు చేశానని.. ఓటేయ్యండి అని మోడీ కూడా అడగడం లేదన్నారు. రామాలయ నిర్మాణం, సీతమ్మ భూమి, ముస్లిం రిజర్వేషన్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారన్నారు.
ఎన్నికలయ్యాయి.. ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఎవరి ధీమా వారికుందన్నారు. మేం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పామన్నారు. ప్రతిపక్షంలో కూడా వారు చెప్పాల్సింది చెబుతున్నారని.. ఎన్నో ఎన్నికలు చూశాను కానీ.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలంతా విదేశాల్లో ఉన్నారన్నారు. జగన్ విదేశీ పర్యటన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు.. లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారని.. ముఖ్య నేతలు విదేశాల్లో ఉన్నారు.. ఇంకొందరు నేతలు ప్రయాణాల్లో ఉన్నారని.. ఇక్కడున్న వారు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించారు. కొంత గ్యాప్ ఇవ్వాలని ఆయన సూచించారు.
మా ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదేళ్లలో చేసిన మంచిని చెప్పి ప్రజాతీర్పుని కోరింది. తప్పకుండా తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది. రెండోసారి సీఎంగా @ysjagan గారు ప్రమాణ స్వీకారం చేస్తారు.
-మంత్రి బొత్స సత్యనారాయణ#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YuMgG41fwr
— YSR Congress Party (@YSRCParty) May 21, 2024