Prajwal Revanna | బెంగళూరు : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు రేవణ్ణ విచారణకు హాజరు కాకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత మూడు వారాల నుంచి పరారీలో ఉన్న ప్రజ్వల్.. జర్మనీ నుంచి లండన్‌కు రైల్లో వెళ్లినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ ధ్రువీకరించింది. అతను ఇప్పటికే పలుమార్లు భారత్‌కు టికెట్లు బుక్ చేసుకుని రద్దు చేసుకున్నట్లు కూడా సిట్ గుర్తించింది. దీంతో సిట్ చేసేదేమీ లేక చివరకు బెంగళూరు ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేవణ్ణను మరింత కట్టడి చేసేందుకు ఆయన బ్యాంకు ఖాతాలపై అధికారులు కన్నేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడు రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇక తన మనుమడు ప్రజ్వల్ దోషిగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు.