Sunday, December 29, 2024
HomeTelanganaMeesala Srinivas | ఎంపీ అర‌వింద్ చెత్త నా కొడుకు.. మీసాల శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Meesala Srinivas | ఎంపీ అర‌వింద్ చెత్త నా కొడుకు.. మీసాల శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నిజామాబాద్: బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై ఆ పార్టీ బ‌హిష్కృత నేత మీసాల శ్రీనివాస్ రావు (Meesala Srinivas) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌ నిజామాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా టోట‌ల్లి అన్‌ఫిట్ క్యాండిడేట్ అని తేల్చిచెప్పారు. అర‌వింద్ ఓ చెత్త నా కొడుకు.. వెధ‌వ నా కొడుకు అంటూ ధ్వ‌జ‌మెత్తారు. నిజామాబాద్ ప్రెస్ క్ల‌బ్‌లో మీసాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అర‌వింద్ ధ‌ర్మ‌పురి ఎవ‌రికి అందుబాటులో ఉండ‌డ‌ని విమ‌ర్శించారు. నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోడు. ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోడని దుయ్య‌బ‌ట్టారు.

అర‌వింద్ ఈ ఐదేండ్లలో ఏ ఒక్క ప‌నైనా చేసిండా..? అని ప్ర‌శ్నించారు. జనాల‌ను రెచ్చ‌గొడుతూ.. విభ‌జించు పాలించు పాల‌సీని అమ‌లు చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ఎవ‌ర్నీ గౌర‌వించ‌డ‌ని, మీడియా మిత్రుల‌కు అస‌లు గౌర‌వం ఇవ్వ‌డని చెప్పారు. పార్టీ వాళ్లంటే గౌర‌వం ఉండ‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, ద‌న్‌పాల్ సూర్యనారాయ‌ణ గుప్తాను జీత‌గాళ్ల మాదిరిగా చూస్తున్నాడు ఆరోపించారు. అమిత్ షా మీటింగ్‌లో ద‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ గుప్తాకు జ‌రిగిన అవ‌మానం.. మ‌మూలు అవ‌మానం కాద‌ని.. అది ఆయ‌న‌కు ఓటేసి గెలిపించిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు జ‌రిగిన ప‌రాభ‌వ‌మ‌ని చెప్పారు.

నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల‌ను గెలిపిస్తాన‌ని అర‌వింద్ మాటిచ్చార‌ని, మ‌రి గెలిపించాడా..? అని ప్ర‌శ్నించారు. రాకేశ్ రెడ్డి, ద‌న్‌పాల్ సూర్యనారాయ‌ణ పార్టీ సింబ‌ల్, వారి శ‌క్తి మీద గెలిచారు. కోరుట్ల‌లో పార్టీ బ‌లంగా ఉంది. మ‌రి ఎందుకు ఓడిపోయారు..? నిజామాబాద్‌లో బ‌స్సు బాగా ఉంది. కానీ ఆ బ‌స్సును న‌డిపే డ్రైవ‌ర్ చెత్త నాకొడుకు, వెధ‌వ నాకొడుకు ఉన్నాడు. జ‌నాల‌కు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు అని మీసాల శ్రీనివాస్ మండిప‌డ్డారు.

RELATED ARTICLES

తాజా వార్తలు