అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందజేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ కి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా చిన్న వయసులోనే ఆమె ఎన్నుకోబడ్డారు.