Asin| ఆసిన్.. ఈ అందాల ముద్దుగుమ్మని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరచిపోరు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ ముద్దుగుమ్మ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. కథానాయికగా కెరీర్ విజయాలతో దూసుకు వెళుతున్న సమయంలో రాహుల్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయింది. జనవరి 19, 2016లో ఆమె పెళ్లి జరిగింది. పెళ్ళికి నాలుగు నెలల ముందు ఆసిన్ లాస్ట్ సినిమా ‘ఆల్ ఈజ్ వెల్’ విడుదల రాగా, ఈ సినిమా అంత ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఇక పెళ్లయ్యాక సినిమాలకి పూర్తి దూరంగా ఉంటున్న ఆసిన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది.
అయితే ఆసిన్ భర్త సక్సెస్ స్టోరీ వింటే మాత్రం ఎవరైన అవాక్కవ్వకుండా ఉండలేరు. కేవలం 3 లక్షలు అప్పుగా తీసుకుని, నేడు 1300 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ గా పట్టా అందుకున్నాడు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక విద్యాభ్యాసం అంత పూర్యయ్యాక తన తండ్రి నుండి మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని బిజినెస్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం రాహుల్ శర్మ మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు.
రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరా అనే స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించగా, ఇది మొదట్లో ఐటీ సాఫ్ట్ వేర్ కంపెనీ. 2008లో మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ సంస్థ 2010 నాటికి హ్యూ జాక్‌మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా ఇండియాలో టాప్ వన్‌లో నిలిచింది. తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. ఇప్పుడు ఈయన నికర విలువ ఏకంగా రూ. 1300 కోట్లు ఉంది. కాగా, ‘హౌస్‌ఫుల్ టూ’ సినిమా ప్రమోషన్‌లో రాహుల్, అసిన్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది.