హర్యాణా పోలింగ్ వాయిదా
హర్యాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల కమిషన్ అక్టోబర్ ఒకటవ తేధీ నుంచి ఐదవ తేదీ కి వాయిదా వేసింది. దీంతో ఎన్నికల లెక్కింపు నాల్గవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ కి వాయిదా పడింది. హర్యాణాలోని బిష్ణోయ్ తెగ వారు తమ పండుగ అక్టోబర్ 2 న ఉందని అందువల్ల పోలింగ్ తేదీ ని వాయిదా వేయాలని కోరారు. దీంతో ఎన్నికల కమిషన్ కొత్త తేదీలను ప్రకటించింది. బిష్ణోయ్ తెగవారు తమ గురువు జంబేశ్వర్ స్మారకార్థం అసోజ్ మాసం అమావాస్య నాడు పండుగ జరుపుకుంటారు. ఈ సందర్బంగా హర్యాణాలోని సీర్సా, ఫతేహాబాద్, హిసార్ ప్రాంతాలలోని బిష్ణోయ్ తెగవారు రాజస్థాన్ లోని స్వంత గ్రామానికి వెళ్తారు. అందువల్ల వారి ఓటింగ్ హక్కులను ఉపయోగించుకోనివ్వడం కోసం వాయిదా వేసినట్టు ఎన్నికల కమిషన్ వెళ్ళడించింది.