Sunday, December 29, 2024
HomeSportsFinal IPL Match | ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ కొడుతుందా..? జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారంటే..?

Final IPL Match | ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ కొడుతుందా..? జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారంటే..?

Final IPL Match | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌కు వేళైంది. మరికొద్ది గంటల్లో మ్యాచ్‌ మొదలుకాబోతున్నది. కోట్లాది మంది అభిమానులు మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 17వ సీజన్‌ టైటిల్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి. ఎలాగైనా ఈ సారి కప్‌ను కొట్టాలని ఈ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్‌ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలువబోయేది ఎవరో అంచనా వేశారు. జ్యోతిష్యుడు వేణు స్వామి తన అంచనాలను వెల్లడిస్తూ.. జట్టు ఓనర్‌ ఓనర్‌ కావ్య మారన్‌ జాతకంలో గతంలో దోషం ఉందని.. అప్పటి వరకు సన్‌రైజర్స్‌ జట్టు డిజాస్టర్‌లోనే ఉంటుందన్నారు.

ప్రస్తుతం కావ్య జాతకం మిథున రాశి జాతకమని.. యోగం మారిందని తెలిపారు. దాంతో సన్ రైజర్స్ జట్టుకు కలిసివస్తుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పాట్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరిన జట్టు ఈ సారి కప్‌ను నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోల్‌కతా – హైదరాబాద్ ఇప్పటి వరకు 27సార్లు తలపడగా.. కేకేఆర్‌ 18, ఎస్‌ఆర్‌హెచ్‌ 9 మ్యాచుల్లో గెలిచాయి.

అయితే, ఈసారి కేకేఆర్ ఫైనల్‌కి చేరడంలో గంభీర్ పాత్ర కీలకంగా మారింది. ఇప్పటికే ఇరుజట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో చెన్నైలో సందడి చేశారు. చెన్నై బీచ్‌లో ఇతర ప్రాంతాల్లో కప్ తో మరింత ఆసక్తి పెంచారు. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు ఉన్నది. వర్షం కురిసే అవకాశం తక్కువగానే ఉన్నా.. రద్దయితే రిజర్వ్‌డే ఉన్నది. రిజర్వ్‌ డేలోనూ మ్యాచ్‌ జరుగకపోతే కోల్‌కతా జట్టు విజేతగా నిలువనున్నది. హైదరాబాద్‌ కంటే కేకేఆర్‌కు ఎక్కువ పాయింట్లు ఉండడంతో టైటిల్‌ వరించే అవకాశం ఉన్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు