Sunday, December 29, 2024
HomeBusinessPAN-Aadhaar Link | మూడు రోజుల్లో ముగియ‌నున్న ఆధార్ పాన్ లింక్ గ‌డువు

PAN-Aadhaar Link | మూడు రోజుల్లో ముగియ‌నున్న ఆధార్ పాన్ లింక్ గ‌డువు

న్యూఢిల్లీ: ప‌న్ను చెల్లింపుదారుల‌ను ఆదాయ ప‌న్న విభాగం అప్ర‌మ‌త్తం చేసింది. పాన్ కార్డుకు ఆధార్‌ను (PAN-Aadhaar Link) జ‌త‌య‌డానికి ఉన్న గ‌డువు మ‌రో మూడు రోజుల్లో ముగుస్తుంద‌ని తెలిపింది. మే 31 లోపు పాన్‌ కార్డ్‌కు ఆధార్‌ కార్డ్‌ను లింక్‌ చేయాలని సూచించింది. తద్వారా అధిక ట్యాక్స్‌ డిడక్ట్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.

పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను 2024, మే 31 లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు లేదా పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చని తెలిపింది.

లేనిపక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్‌/టీసీఎస్‌ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తుచేసింది. దీనికి పాన్‌ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత లేదా చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు పాన్‌ యాక్టివేట్‌ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది.

ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయనివారి పాన్‌ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు.

అప‌రాద రుసుముతో అనుసంధానం ఇలా..

  • ముందుగా ఐటీ శాఖ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాలి. అందులో ‘ఈ-పే ట్యాక్స్‌’పై క్లిక్‌ చేయాలి.
    అక్కడ పాన్‌ నంబర్‌ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాతి పేజీలో మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
  • వెరిఫికేషన్‌ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి.
    తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్‌ ఇయర్‌ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్‌ రిసిప్ట్స్‌ (Other receipts) ఎంచుకోవాలి.
  • ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్‌ గేట్‌వేలో చెల్లింపు పూర్తి చేయాలి. పేమెంట్‌ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి.
  • ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని లింక్‌ ఆధార్‌ను క్లిక్‌ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

RELATED ARTICLES

తాజా వార్తలు