Friday, April 4, 2025
HomeSportsAustralia| టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ స్క్వాడ్‌ని ఆస్ట్రేలియా కూడా ప్ర‌క‌టించేసిందిగా..వాళ్ల‌పై వేటు వేసారుగా..!

Australia| టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ స్క్వాడ్‌ని ఆస్ట్రేలియా కూడా ప్ర‌క‌టించేసిందిగా..వాళ్ల‌పై వేటు వేసారుగా..!

Australia| మరో నెల రోజుల‌లో టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లు కానున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్ని టీమ్స్ మెగా స‌మరానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక ఆయా టీమ్‌ల‌కి సంబంధించిన ఆట‌గాళ్ల ఎంపిక కూడా జ‌రుగుతుంది. నిన్న టీమిండియా స్క్వాడ్‌ని సెల‌క్ట్ చేయ‌గా, ఇక తాజాగా ఆస్ట్రేలియా స్క్వాడ్ ని ప్ర‌క‌టించారు. ఈ సారి ఆ టీమ్‌లో చాలా మార్పులే జ‌రిగాయి అని చెప్పాలి.. సీనియర్ స్టీవ్ స్మిత్, యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాస్ట్ బౌలర్ బెహ్రెన్‌డార్ఫ్‌పై వేటు వేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇక వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్ షిప్ అందించిన క‌మిన్స్‌ని కాద‌ని టీ20 వర‌ల్డ్ క‌ప్ కెప్టెన్‌గా మిచెల్ మార్ష్‌ని ఎంపిక చేశారు. బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేసిన ఫ్రేజర్ కి కూడా నిరాశే ఎదురైంది.

ఇక‌ స్టీవెన్ స్మిత్‌, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్ ని ప‌క్క‌న పెట్టేశారు. అయితే జేక్ ఫ్రేజర్ మెక్-గుర్క్‌ల‌కి ఛాన్స్ దొర‌క్క‌పోవ‌డానికి కార‌ణం వారు ఒక్క టీ20 ఇంటర్నేషనల్ కూడా ఆడకపోవడం వల్లే అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ చెప్పారు. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తమ ప్లేయర్ల వివరాలను విడుదల చేయ‌గా,తాజాగా ఆస్ట్రేలియా కూడా త‌మ 15 మంది ఆట‌గాళ‌ల జాబితా విడుద‌ల చేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక జూన్ 2న వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ప్రారంభం కానుండ‌గా, 29వ తేదీన ముగుస్తుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ వేదిక‌ల‌లో కూడా జ‌ర‌గ‌నుంది. ఏకంగా 20 జ‌ట్లు ఈ సారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతుండ‌డం విశేషం.

ఇక ఆస్ట్రేలియా ప్ర‌క‌టించిన జ‌ట్టు చూస్తే..మిచెల్ మార్ష్ (కేప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా ఉన్నారు. జూన్ 5న బార్బడోస్ వేదికగా ఒమన్‌తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-బిలో ఉన్న ఆస్ట్రేలియాతో ఒమన్‌, స్కాట్‌లాండ్, ఇంగ్లండ్, నమీబియా, స్కాట్‌లాండ్ వంటి దేశాలు పోటి ప‌డ‌తాయి

RELATED ARTICLES

తాజా వార్తలు