Telangana Cinema బలగంకు అవార్డులు
బలగం క్లైమాక్స్ సాంగ్ కొంరమ్మ, మెగిలయ్యలకు
అస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ కు
పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం
ఈ నెల 13న రవీంద్రభారతి లో స్పీకర్, మంత్రుల చేతుల మీదుగా అవార్డు ప్రధానం
అవార్డు గ్రహితలకు నగదుతో పాటు.. మెమోంటోలతో సత్కారం
తెలంగాణ మట్టి వాసనను, బంధాలు, బంధుత్వాల విలువ తెలిపిన వేణు యెల్ధండి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా లో వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన బలగం కొంమరమ్మ, మొగిలయ్యలు క్లైమాక్స్ సాంగ్ పాడి ఎంత పాలపులర్ అయ్యారో అందరికి తెలిసిన విషయమే. జనాన్ని ఆ పాటతో కంటతడి పెట్టించారు. వేణు యెల్ధండి బలగం సినిమాను అద్బుతంగా తెరకెక్కించి చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు 100 అంతర్జాతీయ అవార్డులు, జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఫీలిం పేర్ అవార్డను కూడా సొంతం చేసుకుంది. బలగం సినిమాలో క్లైమాక్స్‌సాంగ్ పాడిన శారదగాళ్లు… బలగం కొంరమ్మ, మొగిలయ్యకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్యగౌడ్ 14 వర్థంతి సందర్బంగా పొన్నంం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం 2024 అవార్డులను ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ కు, బలగం సినిమా క్లైమాక్స్ సింగర్స్ బలగం కొమురమ్మ, మొగిలయ్యలకు ఈ అవార్డులను కమిటి ప్రకటించింది. పురస్కార గ్రహితలకు ఒక్కొక్కరికి రూ.51 వేల నగదుతో పాటు మోమోంటో, శాలువాలతో సత్కరిస్తారు. ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దుళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి శ్రీకృష్టారావు, తెలంగాణ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు హజరుకానున్నారు. ఈ అవార్డును 2022 లో నాళశ్వరం శంకర్(రచయిత), ఒగ్గుకథ ధర్మయ్యకు 2023 లో ప్రముఖ కథ రచయిత నలిమెల భాస్కర్, ఆరుణోదయ విమలక్కకు అందించారు. 2024 లో అస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ కు, బలగం కొమురమ్మ, మొగిలయ్యలకు అందించనున్నారు. తెలంగాణ లో శారదగాళ్ల కళలు బలగం సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా బలగం కొమురమ్మ, మొగిలయ్యతో మరోసారి చర్చకు వచ్చాయి. ఎక్కడో మారుమూల గ్రామానికి చెందిన ఈ కళకారులు అస్కార్ అవార్డు గ్రహితతో సమానంగా ఈ అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. ఈ అవార్డు తెలంగాణ కళలకు ఉన్న గొప్పతనం, విలువను తెలుపుతుందని కళాభిమానులు పేర్కొంటున్నారు. అవార్డు గ్రహితలకు పలువురు అభినందనలు తెలిపారు.