Friday, April 4, 2025
HomeSportsPakistan| క‌రెన్సీ నోట్ల‌తో ఫేస్ తుడుచుకున్న పాక్ క్రికెట‌ర్స్.. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్

Pakistan| క‌రెన్సీ నోట్ల‌తో ఫేస్ తుడుచుకున్న పాక్ క్రికెట‌ర్స్.. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్

Pakistan| కొంద‌రు ప్ర‌ముఖులు స‌ర‌దా కోస‌మో, లేదంటే ఫ‌న్ కోస‌మో చేసే ప‌నులు లేని పోని చిక్కులు తెచ్చిపెడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల క్రికెట‌ర్స్ చేసే కొన్ని త‌ప్పులు అభిమానుల నుండి కూడా విమ‌ర్శ‌ల బారిన ప‌డేలా చేస్తుంది. తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, మరో క్రికెటర్ ఆజం ఖాన్ స‌ర‌దా కోసం చేశారో లేదంటే కావాల‌ని చేశారో తెలియ‌దు కాని వారు చేసిన ప‌నికి నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఆజం ఖాన్ బస్సు లోపల కూర్చుని కరెన్సీ నోట్లతో తన ముఖాన్ని తుడుచుకున్నట్లుగా వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇది చూసిన నెటిజ‌న్స్ బాబర్ ఆజంతో పాటు ఆ దేశ క్రికెట్ జట్టులోని ఇతర క్రికెటర్లపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ వీడియో వాస్తవానికి బాబర్ అజామ్ స్నాప్‌చాట్ అకౌంట్లో షేర్ కావ‌డంతో అభిమానుల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. ఇంత పెద్ద క్రికెటర్ అయి ఉండి అలా ఎలా షేర్ చేస్తారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇద్దరూ ఈ అనుచిత చర్యకు పాల్పడడం విశేషం. బాబర్ వీడియోను రికార్డు చేస్తున్న సమయంలో ఆజం ఖాన్‌ను ఆట‌పట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. అప్పుడు ఆజం ఖాన్ విదేశీ కరెన్సీ నోట్లతో తన నుదురు తుడుచుకుంటున్నట్టుగా కనిపించాడు. దీంతో వీరిద్ద‌రిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. పాకిస్తాన్‌లో ఎంతో మంది ఆక‌లితో అల‌మ‌టిస్తూ చ‌నిపోతున్నారు. వారికి డ‌బ్బు ఇచ్చి ఆదుకోవ‌చ్చు క‌దా.

సాయం చేయ‌క‌పోయి పేద ప్ర‌జ‌ల‌ని వెక్కిరించే విధంగా వీడియోలు చేయ‌డ‌మేంటని మండిప‌డుతున్నారు. వేసవి వడగాలల కారణంగా అనేక మంది తట్టుకోలేక చనిపోతున్నారు.. వారికి ఎంతో కొంత సాయం చేయ‌వ‌చ్చు క‌దా. కానీ, ఈ ఇద్దరు క్రికెటర్లు డబ్బుతో చిన్న పిల్లల మాదిరిగా ప్ర‌వ‌ర్తించ‌డం అస్స‌లు బాగా లేదు. చెమ‌ట‌ని క‌రెన్సీ నోట్స్ తో తుడుచుకుంటారా అని విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం బాబ‌ర్, ఆజం ఖాన్ మాత్రం నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గురి అవుతుండ‌గా, వీటిపై ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి. ఇక ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్ 2-1తో విజయం సాధించ‌డం తెలిసిందే. బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ తదుపరి 4- మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇంగ్లండ్‌తో ఆడ‌నుంది

RELATED ARTICLES

తాజా వార్తలు