Baahubali3| బాహుబలి.. ఈ పేరుని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు.ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని తనవైపుకి తిప్పుకుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇందులో నటించిన నటీ నటులకి కూడా గ్లోబల్ స్థాయి గుర్తింపు దక్కింది. ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి వారు తమ నటనతో ఎంతగానో అలరించారు. ఇప్పటికీ బాహుబలి చిత్రం టీవీలలో వస్తే ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు.
అయితే బాహుబలి 2 తర్వాత బాహుబలి 3 కూడా వస్తే చాలా బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బాహుబలి 3 గురించి పలుసార్లు ప్రభాస్, రాజమౌళికి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. వారు కూడా త్వరలోనే చేసే ప్లాన్ చేద్దామన్నట్టు మాట్లాడారు. అయితే శివగామి పాత్రను బేస్ చేసుకుని ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ ది రైజ్ ఆఫ్ శివగామి’ పుస్తకం అప్పట్లో రిలీజ్ కాగా, అది మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే యానిమేటెడ్ సిరీస్ కూడా రాబోతున్నట్లు రాజమౌళి తెలియజేశారు.ఈ సిరీస్ ద్వారా ప్రతి పాత్ర వెనక ఉన్న కథని చాలా వివరంగా వివరించబోతున్నట్టు తెలుస్తుంది. బాహుబలి 3 ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రాజమౌళి రీసెంట్‌గా ఓ పోస్టర్ రిలీజ్ చేయగా, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారట.
ఇప్పుడు బాహుబలి 3 యానిమేటెడ్ సిరీస్‌గా రాబోతుంది. మరి సినిమాగా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన దృష్టి అంతా ఆ మూవీపైనే పెట్టాడు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై ఇంకా అప్‌డేట్ అయితే లేదు. చిత్రానికి మహరాజ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సినిమా పూర్తయ్యాక బాహుబలి 3 గురించి రాజమౌళి ఆలోచిస్తాడా లేదా అన్నది చూడాలి.