Sunday, December 29, 2024
HomeNationalElephant | పిల్ల ఏనుగుకు 'జ‌డ్' కేట‌గిరి సెక్యూరిటీ.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..!

Elephant | పిల్ల ఏనుగుకు ‘జ‌డ్’ కేట‌గిరి సెక్యూరిటీ.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..!

Elephant | దేశంలోని అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్న‌వారికి, ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల‌కు జ‌డ్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పిస్తుంటారు. మ‌రి ఏనుగు పిల్ల‌కు జ‌డ్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? మీరు చ‌దువుతున్న‌ది, వింటున్న‌ది నిజ‌మే. ఓ ఏనుగు పిల్ల‌కు జ‌డ్ కేట‌గిరి సెక్యూరిటీ క‌ల్పించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఐఏఎస్ ఆఫీస‌ర్ సుప్రియా సాహూ నిత్యం ఏదో కొత్త ర‌కం వీడియోను, ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే, ఆద‌ర్శంగా ఉండే స‌మాచారాన్ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు. ఈసారి వన్యప్రాణుల‌కు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు.

త‌మిళ‌నాడులోని అన్న‌మ‌లై టైగ‌ర్ రిజ‌ర్వ్ కేంద్రంలో ఓ ఏనుగు త‌న పిల్ల‌ల‌తో హాయిగా చ‌ల్ల‌ని ప్ర‌దేశంలో సేద తీరుతోంది. అయితే అందులో ఓ పిల్ల ఏనుగు ఉంది. ఇక ఆ పిల్ల ఏనుగుకు త‌ల్లి ఏనుగుతో పాటు ఇత‌ర ఏనుగులు కాప‌లాగా నిద్రించాయి. ఆ దృశ్యాన్ని చూస్తుంటే పిల్ల ఏనుగుకు జ‌డ్ కేట‌గిరి సెక్యూరిటీ క‌ల్పించిన‌ట్లు ఉంది. ఆ అతి సుంద‌ర‌మైన దృశ్యం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఈ దృశ్యాన్ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ ధాను ప‌రాన్ త‌న కెమెరాలో బంధించ‌గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ సుప్రియా సాహూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అన్న‌మ‌లై టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో హాయిగా సేద తీరుతున్న ఆ ఏనుగు కుటుంబాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చ‌ట‌గా ఉంది. అందులో ఉన్న ఓ పిల్ల ఏనుగుకు జ‌డ్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ట్లు ఉంద‌న్నారు సుప్రియా.

RELATED ARTICLES

తాజా వార్తలు