Friday, April 4, 2025
HomeNationalPrajwal Revanna | లైంగిక ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సస్పెండ్‌ చేసిన జేడీఎస్‌..!

Prajwal Revanna | లైంగిక ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సస్పెండ్‌ చేసిన జేడీఎస్‌..!

Prajwal Revanna | ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించింది. రేవణ్ణపై లైంగిక ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఆయన మొబైల్‌లో భారీగానే అశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, ప్రతిష్ఠ దిగజారుతున్న నేపథ్యంలో సస్పెండ్‌ చేయాలని పలువురు పార్టీ నేత దేవేగౌడకు లేఖ రాశారు. ఈ క్రమంలో అందరితో చర్చలు జరిపిన అనంతరం ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రజ్వల్‌పై పోలీస్‌ కేసు నమోదు చేసింది. అదే సమయంలో ఎన్నికల్లో పాల్గొనవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణకు కూడా పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి తర్వాత ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఓ మహిళ పోలీసు కేసు నమోదు చేసింది. 2019 నుంచి 2022 మధ్య కాలంలో తాను పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె ఆరోపించింది. వీడియో కాల్‌లో ప్రజ్వల్ రేవణ్ణ తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెతో అసభ్యకరమైన సంభాషణలు చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ఐపీఎస్‌ బీకేసింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు మహిళా ఎస్పీలు సైతం ఉన్నారు. ఇక సిట్ బృందం వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపనున్నారు. ఇందులో ప్రమేయం ఉందని తెలితే సిట్‌ బృందం ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు.

RELATED ARTICLES

తాజా వార్తలు