Bala Krishna| గత కొద్ది రోజులుగా బాలయ్య- అంజలి వివాదం తెలుగు రాష్ట్రాలలో ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈవెంట్‌లో బాలయ్య చేసిన రచ్చ హాట్ టాపిక్‌గా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ మొత్తం స్టేజ్ మీద ఉన్న సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని బాలయ్య చెప్పారు. ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కానీ ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య. ఈ సడెన్ షాక్‌కి అంజలికి ఒక్కసారిగా ఏమి అర్ధం కాలేదు.
అయితే వెంటనే తేరుకున్న అంజలి బాలయ్య చర్యను స్పోర్టివ్ గా తీసుకుంది. నవ్వుతూనే ఆయనకి హైఫై ఇచ్చింది. ఆమె పక్కన నిలబడిన నేహాశెట్టి మాత్రం కాస్త అవాక్కయినట్లుగా కనిపించింది. ఆ సమయంలో బాలకృష్ణ ఆమెతో ఏం మాట్లాడారో తెలియనప్పటికీ అంజలి మాత్రం నవ్వుతూనే ప్రతిస్పందించింది. అయితే బాలయ్య చర్యని చాలా మంది తప్పు పట్టారు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ బాలయ్యని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఇదే సమయంలో అంజలి ఒక ట్వీట్ చేసింది.మా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన బాలకృష్ణ )గారికి ధన్యవాదాలు. ఆయనకు, నాకు ఒకరి పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉంది. చాలా కాలం నుంచి మా మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. ఆయనతో ఇలా మరోసారి వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉంది’’ అని చెబుతూ.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలోని కొన్ని మెమరబుల్ మూమెంట్స్‌తో ఉన్న వీడియోని అంజలి షేర్ చేసింది.
ఇదే క్రమంలో బాలకృష్ణ మరోసారి దొరికిపోయాడు. అంజలిని వెనకాల నుంచి కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అదే ఈవెంట్‌లో అంజలిని స్టేజ్ పైకి పిలవగా, ఆ సమయంలో అంజలి, బాలకృష్ణ ఒకే సీట్‌లో కూర్చున్నారు. అంజలిని పిలవగానే ఆమె పైకి లేచే క్రమంలో బాలయ్య తన లెఫ్ట్ హ్యాండ్‌గా ఆమె వెనకాల భాగంలో టచ్ చేయడం వీడియోలో క్లియర్‌గా రికార్డ్ అయింది. ఆ సమయంలో కూడా అంజలి స్మైల్ ఫేస్‌తోనే వెళ్లిపోయింది. ఆ సమయలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు కాని ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
Serious ga Balayya istham ela untadu anedi
But matter ni cover chesi inka peddadi chesthunaru
Ss rajamouli vochi cg chesada @vamsi84
?#Anjali#GangsOfGodavari
pic.twitter.com/Lp99HWnziN— 𝗞𝗜𝗥𝗔𝗡 ɴᴛʀ (@cultNTRfan9999) May 31, 2024