Bala Krishna| బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని కొందరు అంటుంటే, మరి కొందరు ఆయనకి ముక్కు మీద కోపం ఎక్కువ అని అంటుంటారు. బాలయ్యకు కోపం వస్తే ఏం చేస్తారో కూడా ఎవరికి అర్ధం కాదు. అభిమానులను కొట్టడం, ఇబ్బంది పెట్టినవారిపై ఫైర్ అవ్వడం.. సినిమా ఫంక్షన్లలో కూడా రకరకాలుగా ప్రవర్తించడం బాలయ్యకే చెల్లింది అని చెప్పాలి. అయితే సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టే వారిని కొట్టడంలో తప్పులేదన్నట్టుగా బాలయ్యకి సపోర్ట్ చేసే వారు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆయన కొన్ని సార్లు మాట్లాడే మాటలు మాత్రం పెద్ద వివాదాస్పదంగా మారుతుంటాయి. బాలయ్య గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా, ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుండడం, ఫంక్షన్స్ కి హాజరు కావడం చేస్తున్నాడు.
మే 31న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు బాలయ్య. ఈ ఈవెంట్‌కి బాలయ్య ముఖ్య అతిథిగా రావడం సినిమాని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. బాల్యయ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ని ఆకాశానికి ఎత్తేశాడు. అడవి శేష్, విశ్వక్ సేన్ లాంటి కుర్రాళ్లను ఇన్ స్పిరేషన్ గా తీసుకోవాలని అన్నాడు. నా మాదిరిగినే విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడని మాట్లాడాడు. ఇక హీరోయిన్స్‌పై కూడా కాస్త ఘాటుగానే స్పందించాడు. అయితే తాజాగా బాలయ్యకి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయన పక్కనే వాటర్ బాటిల్‌లో మందు ఉండగా, ఆడిటోరియంలో తాగినట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది.
ఇక స్టేజ్ మీద బాలకృష్ణ, నేహాశెట్టి, అంజలి పక్క పక్కన నిల్చొని ఉన్నారు. బాలకృష్ణ.. అంజలిని కాస్త పక్కకు జరగమని చెప్పగా, అంజలి కాస్త పక్కకు జరిగింది. ఇంకోసారి జరగమని చెప్పకుండా ఒక్క తోపు తోశాడు దాంతో అంజలి- నేహా శెట్టి షాక్ కాగా, ఆ తర్వాత నవ్వుతూనే ఉన్నారు. ఆ తర్వాత అంజలితో బాలయ్య మళ్లీ ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా నవ్వుతూ బాలయ్యకు సమాధానం చెప్పింది. అలాగే బాలకృష్ణ తర్వాత అంజలికి నవ్వుతూ హైఫై కూడా ఇచ్చుకున్నారు. మొత్తానికి బాలయ్య చేసిన పని మాత్రం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.