Sunday, December 29, 2024
HomeCinemaBala Krishna: బాల‌కృష్ణ ఫ‌స్ట్ ల‌వ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు.. పెళ్లి చూపుల్లో ట్విస్ట్ మాములుగా...

Bala Krishna: బాల‌కృష్ణ ఫ‌స్ట్ ల‌వ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు.. పెళ్లి చూపుల్లో ట్విస్ట్ మాములుగా లేదు..

Bala Krishna: 14 ఏళ్లకే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి త‌నదైన న‌ట‌న‌తో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు బాల‌య్య‌. ‘తాతమ్మ కల’ మూవీ ద్వారా బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్ట‌గా ఆ త‌ర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో హీరోగా తొలి హిట్ అందుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సోదరులు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి, లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాల‌య్య క్రేజ్ అమాంతం పెరిగింది.

1991లో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369తో బాల‌య్య త‌న‌లోని మ‌రో యాంగిల్‌ని బ‌య‌ట‌పెట్టాడు. ఇక ‘భైరవద్వీపం’ మూవీ ఆయ‌న‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది . ఆ త‌ర్వాత కూడా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఈ సినిమా చిత్రీకరణ కి బాల‌య్య బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఎన్నికలు అయ్యే సమయం వరకు విరామం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక బాల‌య్య ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. బాలకృష్ణ 1982లో బాలకృష్ణ వసుంధర దేవిని వివాహం చేసుకోగా, వారికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. బ్రాహ్మణి, తేజస్వికి ఇప్ప‌టికే పెళ్లి కాగా, అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే బాల‌య్య‌.. త‌న‌లైఫ్‌లోకి వ‌సుంధర ఎలా వ‌చ్చిందో చెప్పి ఆశ్చర్య‌ప‌రిచారు. బాలయ్యను ఫస్ట్ లవ్ గురించి అడగ్గా త‌న‌కు ఎలాంటి లవ్ లేదు అన్నాడు. ఇక వసుంధరతో తన పెళ్లి ఒక నాటకీయ పరిణామం అని చెప్పారు. ఒక‌సారి బంధువుల వివాహానికి వెళ్లిన బాలకృష్ణ అక్కడ వసుంధరను చూని తెగ న‌చ్చేశాడ‌ట‌. ఇక ఆ త‌ర్వాత త‌న‌కి పెళ్లి చూపులు చూస్తుండ‌డం అనుకోకుండా ఓ సంబంధం చూడ్డానికి వెళ్లిన‌ప్పుడు బంధువుల పెళ్లి వేడుకలో చూసిన అమ్మాయే తన ముందు కూర్చుని ఉండ‌టం, వెంట‌నే బాల‌య్య ఓకే చెప్ప‌డం, వెంట‌నే పెళ్లి కూడా జ‌ర‌గ‌డం వెంట‌వెంట‌నే అయిపోయాయ‌ని బాల‌య్య అన్నాడు. వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యారావు వందల కోట్లకు అధిపతి కాగా, ఆయనకు శ్రీ రామ్ దాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది.

RELATED ARTICLES

తాజా వార్తలు