Hema| బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. రేవ్ పార్టీలో హేమకి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మే 27న సోమవారం పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది అని నోటీసులు పంపారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారందరినీ ఒకేసారి విచారణ జరపడం సాధ్యం కాని నేపథ్యంలో ఈరోజు ఎనిమిది మందిని విచారణకు హాజరుకావల్సిందిగా తెలియజేశారు. అందులో నటి హేమ కూడా ఉంది. అయితే హేమ ఈ విచారణకి హాజరవుతుందా లేదా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో డుమ్మా కొట్టింది.
తాను విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని హేమ కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు బెంగుళూరు సీసిబికు హేమ లేఖ రాశారట. అయితే హేమ సీసీబీ పోలీసులు హేమ లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఆమెకు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్. మరోవైపు హేమని సేఫ్ చేయడానికి ఏపీ రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారట. కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు సీసీబీకు పదే పదే ఫోన్ చేస్తూ హేమని అరెస్ట్ చేయవద్దని ఒత్తిడి చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఫామ్ హౌజ్‌పై దాడి చేసి మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకోగా, వారందరికీ రక్తపరీక్షలు చేసారు. అయితే నటి హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో వీరిని విచారించేందుకు నోటీసులు పంపించారు.
హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న సమయంలో హేమ పెద్ద డ్రామా ఆడింది. ఆ వార్తలను ఖండిస్తూ వెంటనే ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని.. తాను హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ.. ఆ వీడియోలో చాలా క్లియర్‌కట్‌గా చెప్పింది. అయితే ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమ ఫొటోను సైతం విడుదల చేశారు. దీంతో రేవ్ పార్టీలో పాల్గొన లేదంటు ఆమె చేసిన వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది. ఇక ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ.. కృష్ణవేణి పేరుతో హాజరైనట్లు తెలుస్తుంది. హేమ అసలు పేరు కృష్ణవేణి.