హైదరాబాద్: ఏదైనా షాప్‌కి వెళ్లినా, మరేదైనా కొనుగోలు చేసిన జేబులో ఫోన్ తీసి ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సహాయంలో టక్కున పేచేస్తున్నాం. ఎవరికైనా డబ్బు పంపించాలంటే ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. మరి నగదును అకౌంట్‌లో జమచేయాలన్నా.. పెద్దమొత్తంలో క్యాష్ కావాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అందుకే బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయి, ఎప్పుడు సెలవో (Bank Holidays) తెలుసుకోవాల్సిందే. సో.. మరో ఐదు రోజులైతే ఏప్రిల్ నెల ముగుస్తుంది. ఈ నెల 27 (నాలుగో శనివారం), 28 (ఆదివారం) తేదీలు పోతే బ్యాంకులు పనిచేసేది మరో నాలుగు రోజులు మాత్రమే.
ఆ నాలుగు రోజులు పోతే మే (May) నెల మొదలు కానుంది. అయితే ఈసారి మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్ (Bank Holidays) కానున్నాయి… ఎన్ని రోజులు పనిచేస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈసారి దాదాపు 12 రోజులపాటు బ్యాంకులకు సెలవులున్నాయి. అందువల్ల హాలీడేస్‌ని చూసుకుని సంబంధిత పనులను ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
సెలవులు ఎప్పుడంటే
మే 1: కార్మిక దినోత్సవం (మే డే కావడంతో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
మే 5: ఆదివారం
మే 8: రవీంద్రనాథ్ జయంతి (రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కారణంగా కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు)
మే 10: బసవ జయంతి, అక్షయ తృతీయ (బెంగళూరులో సెలవు)
మే 11: రెండవ శనివారం
మే 12: ఆదివారం
మే 16: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు)
మే 19: ఆదివారం
మే 20: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో (బేలాపూర్, ముంబైలో బ్యాంకులకు సెలవు)
మే 23: బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, భోపాల్, బేలాపూర్, డెహ్రాడూన్, ఇటానగర్, చండీగఢ్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు బంద్
మే 25: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 26: ఆదివారం
మే 13: తెలంగాణ, ఏపీతోపాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ఉన్న రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అయితే ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి స్థానిక ప్రజలు సెలవు రోజులను బట్టి బ్యాంకుల్లో పనులను పూర్తి చేసుకోవచ్చు.