Curry leaves | దాదాపు ప్రతి వంటలో కరివేపాకు (Curry Leaves) కచ్చితంగా ఉపయోగిస్తుంటాం. ఇది వంటలకు అదనపు రుచిని కలిస్తుంది. ప్రాంతాలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా దాదాపుగా అందరూ దీన్ని విరివిగా వినియోగిస్తారు. అందుకే చాలామంది కరిపాకు చెట్లను ఇంట్లోనే పెంచుకుంటారు. ఇవి వంటల్లో సుగంధ రుచులను మెరుగు పర్చడమే కాకుండా.. భోజనంలో పోషక విలువలను సైతం పెంచుతాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు, ఆల్కలాయిడ్లు, గ్లైకో సైడ్లు, ఫినోలిక్ కంపౌడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకి 8 నుంచి 10 తాజా కరివేపాకులు తినవచ్చని వైద్యులు చెబుతున్నారు.
దీన్ని ఆయా కూరల్లో వాడటం మాత్రమే కాకుండా పొడిగా చేసి కూడా తింటారు. జుట్టు సంబంధిత సమస్యల నివారణకు కరివేపాకును వాడతారు. ముఖ్యంగా మహిళలు వీటి ఆకుల్ని మైదాకులా చేసుకుని జుట్టుకు అప్లై చేసుకుంటారు. తెల్ల వెంట్రుకలు ఉన్నవారు కూడా జుట్టు రంగు మారటం కోసం వాడుతారు. ఇలాంటి కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
లాభాలు
- కరివేపాకు నీటిని తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువల్ల రోజుకు 4 రెబ్బలు చొప్పున ఖాళీ కడుపుతో తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
- కరివేపాకు రసం కొలెస్ట్రాల్ స్థాయుల్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు తినటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
- అల్జీమర్స్ వ్యాధి లాంటి న్యూరో డీజెనెరేటివ్ పరిస్థితుల నుంచి కాపాడే పదార్థాలు ఇందులో ఉన్నాయి.
ఇందులో ముఖ్యమైన యాంటీ క్యాన్సర్ సమ్మేళనాలున్నాయి. - కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి ఉపశమనం కలిగించే ప్రభావాలు సైతం ఉన్నాయి.
- జీర్ణ సమస్యలు ఉన్నవారు కర్రీలీవ్‌ను రోజూ తినాలి. గ్యాస్, అజీర్ణం ఉండవు. బరువు కూడా తగ్గవచ్చు.
హైబీపీ ఉన్నవారు కరివేపాకు తింటే బీపీ అదుపులోకి వస్తుంది. రక్తం సరఫరా మెరుగుపడుతుంది. - కంటి సమస్యలు ఉన్నవారు కరివేపాకులను రోజూ తింటే కంటి చూపు పెరుగుతుంది.
నష్టాలు
- కరివేపాకులో హాని కలిగించేవి కూడా ఉన్నాయి. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గే అవకాశం ఉంది.
- అలెర్జీ ఉన్న వాళ్లు కరివేపాకును వాడకపోవడం మంచిది.
- గర్భిణులు, బాలింతలు కరివేపాకు తినే విషయంలో వైద్యుల్ని సంప్రదించాలి.
- కరివేపాకు కాయలు విషపూరితమైనవి. కనుక వాటికి దూరంగా ఉండాలి.
- కరివేపాకులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. దీంతో శరీరంలో వాపు సమస్య రావచ్చు.