లోకేష్ కనకరాజ్ సొంత నిర్మాణ సంస్థ ‘జి స్క్వేర్’ బ్యానరుపై రాఘవ లారెన్స్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘బెంజ్’. ఇందులో ఎస్‌జే సూర్య, ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రెమో’, ‘సుల్తాన్’ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథ డిమాండ్ మేరకు ఈ ఇద్దరు అగ్రనటులను తీసుకున్నట్టు సమాచారం.