గురువారం జరగబోయే ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి (Finance Ministers conclave) కేరళ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు, రాష్ట్రాల సమస్యలు, 16వ ఆర్థిక సంఘంలో న్యాయమైన వాటా కోసం అవసరమైన యునైటెడ్ ఫ్రంట్ ప్రతిపాదనలను సమావేశంలో చర్చించనున్నారు. తిరువనంతపురంలో జరుగుతున్నఈ సమావేశాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రారంభిస్తారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తారు.