Telangana Exit Polls | హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్‌కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం కాంగ్రెస్ – బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు వెల్లడైంది. అధికార కాంగ్రెస్ కంటే బీజేపీనే అత్యధిక స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం కానున్నట్లు అన్ని సర్వేల్లో వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? లేదా అనే విషయం జూన్ 4వ తేదీన తేలనుంది.
పీపుల్స్ పల్స్
కాంగ్రెస్ 7-9
బీఆర్ఎస్ 0-1
బీజేపీ 6-8
ఎంఐఎం 1
ఆరా సర్వే
కాంగ్రెస్ 7-8
బీఆర్ఎస్ 0
బీజేపీ 8-9
ఎంఐఎం 1
ఇండియా టీవీ – సీఎన్ఎక్స్
కాంగ్రెస్ 6-8
బీఆర్ఎస్ 0-1
బీజేపీ 8-10
ఎంఐఎం 1
జన్‌కీ బాత్
కాంగ్రెస్ 4-7
బీఆర్ఎస్ 0-1
బీజేపీ 9-12
ఎంఐఎం 1