Wednesday, January 1, 2025
HomeCinemaBigg Boss8: త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 8.. ఫ‌స్ట్ కంటెస్టెంట్ ఎవ‌రో తెలిసిపోయింది..!

Bigg Boss8: త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 8.. ఫ‌స్ట్ కంటెస్టెంట్ ఎవ‌రో తెలిసిపోయింది..!

Bigg Boss8: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది.తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మ‌వుతుంది. సీజ‌న్ 7 మంచి స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు సీజ‌న్ 8 ముందుగానే మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. సీజ‌న్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఆయ‌న విన్న‌ర్ అయి జైలుకి వెళ్ల‌డం, అన్న‌పూర్ణ స్టూడియో ముందు పెద్ ర‌చ్చ జ‌ర‌గ‌డం ఇవ‌న్నీ మ‌నం చూశాం. అయితే అనేక కాంట్ర‌వ‌ర్సీస్‌, పెద్ద ఇష్యూస్ జ‌రిగిన నేప‌థ్యంలో సీజ‌న్ 8 ఉంటుందా లేదా అనే చ‌ర్చ నడిచింది.

అయితే బిగ్ బాస్ తెలుగు 8 కి రంగం సిద్ధం అవుతుందన్న వార్త షేక్ చేస్తుంది. ఈ వార్త విని బిగ్ బాస్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. సీజన్ 7 సక్సెస్ ని కంటిన్యూ చేసేలా టాప్ సెలెబ్స్ ని హౌస్లోకి పంపాలని ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారట‌. పాత కంటెస్టెంట్స్‌ని సైతం హౌజ్‌లోకి పంప‌నున్నార‌ని తెలుస్తుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం మొదటి కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చల్ చేస్తుంది. కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నాడట.

కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల ఎంత ఫేమస్ అయ్యాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కార్తీక దీపం అతనికి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. బుల్లితెర‌పై అనేక మంది ఫ్యాన్స్‌ని క్రియేట్ చేసింది. అయితే నిరుప‌మ్ క‌నుక బిగ్ బాస్ లోకి అడుగుపెడితే షోకి మ‌రింత క్రేజ్ ద‌క్క‌డం ఖాయం అని అంటున్నారు. అయితే ఇటీవ‌లే కార్తీక దీపం 2 ప్రారంభం అయ్యింది. మ‌రి ఈ స‌మయంలో ఆయ‌న షో మానేసి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ‌తాడ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో అస్స‌లు వాస్త‌వం ఉండి ఉండ‌దు. కార్తీక దీపం పార్ట్ 1లో డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌ రెండు పాత్రలను చంపేశాక టీఆర్పీ భారీగా పడిపోవడం మ‌నం చూశాం. తెలిసి తెలిసి ఈ తప్పు మ‌రోసారి చేయ‌రు.

RELATED ARTICLES

తాజా వార్తలు