Friday, April 4, 2025
HomeTelanganaMadhavi Latha | ఓటు హ‌క్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త‌.. వీడియో

Madhavi Latha | ఓటు హ‌క్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త‌.. వీడియో

Madhavi Latha | హైద‌రాబాద్ : తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లకు పోలింగ్ ప్ర‌క్రియ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున గ‌డ్డం శ్రీనివాస్ యాద‌వ్, ఎంఐఎం నుంచి అస‌దుద్దీన్ ఒవైసీ బ‌రిలో ఉన్నారు.

ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం మాధ‌వీల‌త మాట్లాడుతూ.. ఓటు వేయ‌డం ప్ర‌తి పౌరుడి బాధ్య‌త అని పేర్కొన్నారు. ఓటు రెండు మార్పుల‌ను తీసుకువ‌స్తుంద‌న్నారు. ఒక‌టి కుటుంబాల్లో మార్పు, అభివృద్ధిని, రెండోది నిరుపేద‌లు, ద‌ళితుల జీవితాల‌ను మార్చే అవ‌కాశం క‌ల్పిస్తుంది. అభివృద్ధి వైపు ప‌య‌నించాలంటే ప్ర‌తి పౌరుడు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని మాధ‌వీల‌త కోరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు