రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారని, బిజెపిలో పాత కొత్త తేడా ఏమీ ఉండదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉత్తర దక్షిణాది ప్రాంతాల్లో బిజెపి రాబల్యం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశాలు శంషాబాద్ లో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ధర్మేంద్ర ప్రధాన్ బిజెపి లీడర్లను కేడర్ను జోష్ లో నింపే ప్రయత్నం చేశారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేసారని, గత పార్లమెంటు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు.
దక్షిణ భారతంలో బీజేపి బల పడుతుందని చెప్పారు.
కేరళ లో బీజేపీ ఖాతా తెరిచిందని, తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామని పేర్కొంటూ తెలంగాణలో బీజేపీ నీ నెంబర్ వన్ పార్టీ గా మార్చేందుకు తమ వద్ద 15వందల రోజుల ప్రణాళిక ఉందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద దాటలేదని,
13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని విమర్శించారు.
మూడోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది.
ఇండియా కూటమి కి నాయకత్వమే లేదన్నారు.
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమాన పరిస్తుంది
ఎన్డీఏ అధికారంలో ఉన్నానీ రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు
మోడీ ఉన్నానీ రోజులు రిజర్వేషన్లు కు ఎటువంటి డోక లేదు
తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి
ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చింది
గత పదేళ్ళ ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది
పదేళ్లలో తెలంగాణ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర సహకారం అందించింది
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్ లో బీజేపీ నీ మరింత బలపర్చాల్సిన అవసరం ఉంది
పార్టీలో కొత్త పాత లేదు
బీజేపీ లో చేరిన వారందరూ పాత వారే ….
ఈటెల పార్టీకి కొత్త కాదు ఆయన పాత అయిపోయాడు
కాంగ్రెస్ – బీ అర్ ఎస్ లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుంది
ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కించాలి
అప్పుడే స్థానికంగా పార్టీ బలోపేతం అవుతుంది
టాప్ 5 ఎకనామిక్ సిటీస్ లో హైదరాబాద్ ఉంది
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనేది నేతల పదవుల కోసం…తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే