రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వేళ బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభఝన హామీలపై సామరస్య మార్గంలో పరిష్కరించుకోవలని తామూ కోరుకుంటున్నామన్నారు. సమస్యలన్నీ చర్చల ద్వారా సానుకూల వాతావరణంలోనే పరిష్కరించబడుతాయ తప్ప ప్రజలను ప్రాంతీయ తత్వం పేరుతో రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడపడం భావ్యం కాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రికికి బహిరంగ లేఖ రాయబోతున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. శనివారం శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని, బీజేపీ ముస్లింలకు వ్యతిరేం అని విష ప్రచారం చేసిందని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మోడీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. మోడీ సర్కార్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు.