Friday, April 4, 2025
HomeTelanganaKCR | సిద్దిపేట క‌న్న బిడ్డ‌ను.. ఈ మ‌ట్టికి నా వంద‌నం : కేసీఆర్

KCR | సిద్దిపేట క‌న్న బిడ్డ‌ను.. ఈ మ‌ట్టికి నా వంద‌నం : కేసీఆర్

KCR | సిద్దిపేట : ఒక‌నాడు ఇదే అంబేద్క‌ర్ చౌర‌స్తా నుంచి ఉద్య‌మం కోసం క‌రీంన‌గ‌ర్ పోతుంటే గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన గ‌డ్డ ఈ సిద్దిపేట‌. సిద్దిపేట క‌న్న బిడ్డ‌ను కాబ‌ట్టి ఈ మ‌ట్టికి నా వంద‌నం అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట‌లోని అంబేద్క‌ర్ చౌరస్తాలో నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

ఈ ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు మీ ముందు ఉన్నాయి. బీజేపీ ఎంజెండాలో ఏనాడూ పేద‌ల అవ‌స్థ‌లు, మాట‌లు ఉండ‌వు. రైతులు, చేనేత, బ‌డుగుల బ‌హీన వ‌ర్గాల బాధ‌లుండ‌వు. పెట్టుబ‌డుదారుల పార్టీ.. కార్పొరేట్ల పార్టీ త‌ప్ప సామాన్య జ‌నుల పార్టీ కానే కాదు బీజేపీ. ఈ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు మోదీ విదేశాల నుంచి న‌ల్ల‌ధంన తీసుకొచ్చి ఒక్కొక్క‌రికి రూ. 15 ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్పారు. 15 ల‌క్ష‌లు వ‌చ్చాయా..? బేటీ ప‌డావో బేటి బ‌చావో, అమృత్ కాల్, అచ్చేదిన్ వ‌చ్చిందా..? ఏం రాలేదు అంత వ‌ట్టిదే గ్యాస్. బీజేపోళ్లు చెబుతున్నారు.. 400 సీట్లు వ‌స్తాయి అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రూ. 400 అవుత‌ది కాని న‌రేంద్ర మోదీకి 400 సీట్లు రావు. విద్వేషాలు నింపి, ప్ర‌జ‌ల మ‌ధ్య ప‌గ‌లు పెంచి దేశాన్ని చీల్చే ప‌నే చేస్త‌ది బీజేపీ. రైతులు, పేద‌ ప్ర‌జ‌లు, చేనేత కార్మికుల గురించి మంచి ప‌ని చేసే పార్టీ కాదు బీజేపీ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అర‌చేతిలో వైకుంటం చూపెట్టి గద్దెనెక్కింది. రుణ‌మాఫీ, రైతుబంధు రాలేదు. క‌రెంట్ లేదు. క‌రెంట్ కోత‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. రంగ‌నాయ‌క సాగ‌ర్ ఎండ‌బెట్టారు. ఉచిత బ‌స్సు ఫెయిల్ అయింది. స‌ర్కాస్‌ మాదిరి ఆ ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌యారైంది. రాష్ట్ర, దేశ భ‌విష్య‌త్ కోసం ఆలోచించి ఓటేయాలి ఆగ‌మాగం వేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు కాలేదు. అయిత‌ద‌ని ఆశ కూడా లేదు. బీఆర్ఎస్ హ‌యాంలో రూ. 30 వేల కోట్లు రెండు ద‌ఫాలుగా రుణ‌మాఫీ చేశాం. డిసెంబ‌ర్ 9న 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తా అని రేవంత్ అన్నాడు. కానీ జ‌ర‌గ‌లేదు. ఆరు గ్యారెంటీల‌తో పాటు 420 ఇస్తే ఒక్కప‌ని కూడా జ‌ర‌గ‌లేదు. బీజేపీతో కూడా ఏం జ‌ర‌గ‌లేదు. అదే బీఆర్ఎస్ హ‌యాంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను కులం, మ‌తం అనే తేడా లేకుండా అంద‌ర్నీ ముందుకు తీసుకుపోయాం. అంద‌ర్నీ కాపాడినం. పేద‌ల‌కు, వృద్దుల‌కు 2 వేల పెన్ష‌న్ ఇచ్చాం. కాంగ్రెసోళ్లు నాలగు వేలు ఇస్తాం అన్నారు. రాలేదు వ‌చ్చే అవ‌కాశం కూడా లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు