సిద్దిపేట : తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు (Loksabha Elections 2024) ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తన సతీమణి శోభతో కలిసి ఓటేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కేసీఆర్ ఆప్యాయంగా పలుకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట హరీశ్‌రావుతో పాటు చింతమడక నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65 శాతానికి మించి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.