Manne Krishank | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతకు సంబంధించి.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఫేక్ సర్క్యులర్ జారీ చేశారని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు జైలు నుంచి మన్నె క్రిశాంక్ ఒక లేఖ విడుదల చేశారు.
నేను అరెస్ట్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు, న్యాయవాదులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. నా పోరాటం కొనసాగుతుంది, నేను ఒరిజినల్ సర్క్యులర్ పోస్ట్ చేశాను. నేను తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసానని నిరూపిస్తే ఎంత పెద్ద శిక్షకైనా నేను సిద్ధం, ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలని మోసం చేసి ఉంటే తన ముఖ్యమంత్రి పదవికి నుండి తప్పుకోవాలి అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.