MLC Kavitha | న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం 10 గంటలకు కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ములాఖత్ అయ్యారు. గతంలో కవిత తల్లి శోభ, కేటీఆర్ ములాఖత్ అయిన సంగతి తెలిసిందే.
సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. 24వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.