Friday, April 4, 2025
HomeTelanganaBRS MLC K. Navin Kumar: కె .నవీన్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వవివరణ

BRS MLC K. Navin Kumar: కె .నవీన్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వవివరణ

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కె .నవీన్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వవివరణ

  • ఈనాడు పత్రికలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఈ రోజు నాపై ప్రచురించిన వార్తను ఖండిస్తున్నాను .
  • ఆ వార్త అవాస్తవమని తెలియజేస్తున్నాను.
  • ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు పిలిచినా నాపై చేసిన / వచ్చిన వార్తలు అవాస్తవమని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను.
  • కావాలని, పనిగట్టుకొని నా మీద బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది.
  • ఈనాడు పత్రికలో ప్రచురితమైన విధంగా ప్రణీత్ రావు ,శ్రవణ్ రావులతో నాకు కనీస పరిచయాలు కూడా లేవు.
  • నేను ఏనాడు వారితో ఫోన్లో మాట్లాడిన సందర్భాలు కూడా లేవు.
  • ఫోన్ ట్యాపింగ్ తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇతర అధికారులను కూడా ఫంక్షన్స్ లో లేదా మేము నివసించే ప్రాంతంలో గతంలో పనిచేసిన అధికారులను మర్యాదపూర్వకంగా మాట్లాడడమే తప్ప ఎటువంటి ఇతర విషయాలలో జోక్యం చేసుకోలేదు.
  • పత్రికలో పేర్కొన్న విధంగా నాకు ఫోన్ టాపింగ్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేస్తున్నాను. ఇలాంటి అవాస్తవాలతో,రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా దురుద్దేశంతో కొంతమంది నా పేరు ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు . దీంట్లో భాగంగానే మరొకసారి నా పేరు తెరపైకి తీసుకొచ్చారు.
  • దర్యాప్తు అధికారులు ఈ వ్యవహారం పై నిష్పాక్షిక , లోతైన దర్యాప్తు చేసి నిజా నిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాను.
  • మీడియా మిత్రులు కూడా వాస్తవాలు తెలుసుకొని రాయాలని నా విజ్ఞప్తి . నా ఫ్రై ఏమైనా ఆరోపణలు వస్తే దయచేసి నా వివరణ కూడా తీసుకోవాలని కోరుతున్న.

ఇట్లు
కె నవీన్ కుమార్, ఎమ్మెల్సీ

RELATED ARTICLES

తాజా వార్తలు