Wednesday, January 1, 2025
HomeEducationBRS: అరెస్టుని ఖండించిన డా. ఎర్రోళ్ల శ్రీనివాస్.

BRS: అరెస్టుని ఖండించిన డా. ఎర్రోళ్ల శ్రీనివాస్.

నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుని ఖండించిన బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్

 

కాంగ్రెస్ పార్టీ గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వారి సమస్యలను వినడానికి ఒక్క మంత్రి, అధికారి అందుబాటులో వారితో చర్చలు జరపకపోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు నిర్బంధ పాలన. పోలీసులు రాత్రి నుండే అమ్మాయిలని కూడా చూడకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించి ఎన్నికల్లో వారిని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రొడ్డుకీడ్చింది కాంగ్రెస్. ఇప్పటికైనా వారితో చర్చలు జరిపి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్లను, హామీలను నెరవేర్చాలి. సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టం. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతాం. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేసి, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

RELATED ARTICLES

తాజా వార్తలు