తెలంగాణ ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి గారి మరణం కలచివేసిందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో కలిసి పనిచేశాం. భువనగిరి ప్రాంత ప్రజల కోసం జిట్టా ఎంతో తపనపడ్డారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాష్ర్రంలో యువజన సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసి యువతను ఏకం చేసే ప్రయత్నం చేసారు. బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం పటిష్టానికి కృషి చేశారు. తెలంగాణ సంబురాల పేరుతో సాంస్కృతిక ఉత్సవాలు చేసి తెలంగాణ వాదులను ఏకం చేసాడని అన్నారు.
చిన్న వయసులోనే ఆయన మనకు దూరం కావడం బాధాకరం. బాలకృష్ణారెడ్డి గారి మరణం తీరని లోటు. అయిన కుటుంబ సభ్యులకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.