KTR | భువనగిరి : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని పార్టీ కేడర్‌కు, పట్టభద్రులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. చట్ట సభలకు ప్రశ్నించే గొంతుకను పంపాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై మీ అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు. భువనగిరిలోని సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించండి. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. తాము గుడి పేరుతో ఓట్లు అడగలేదు. ప్రాజెక్టులు కట్టాం.. వాటికి దేవుళ్ల పేర్లు పెట్టాం.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మేం చేసిన పనిని చెప్పుకోలేదు. రెండోది.. కొన్ని వర్గాలను దూరం చేసుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ వైపు బిట్స్ పిలానీలో చదువుకున్న అభ్యర్థి.. మరో వైపు బ్లాక్ మెయిలర్, లాబీయింగ్ చేసే అభ్యర్థి ఉన్నారు. ఎవరు కావాలో ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఈ నెల 27న జరిగే వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై మీ అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నా..
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS @RakeshReddyBRS… pic.twitter.com/u7veTrJKQh
— BRS Party (@BRSparty) May 19, 2024