BUJJI: టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు రిలీజ్ అయి చాలా నెలలే అవుతుంది. థియేటర్స్‌లో సరైన ఆక్యుపెన్సీ లేక ఇటీవల థియేటర్ ఓనర్స్ 10 రోజుల పాటు షోస్ క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు జెట్ స్పీడ్‌తో కల్కి మూవీని జూన్ 27న థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 AD చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తుండగా, ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు. ఈ చిత్రంలో బుజ్జి పాత్ర ఎంతో కీలకమైనది కాగా, ఇటీవల బుజ్జి గురించి ఓ వీడియో విడుదల చేశారు. బుజ్జిని తయారు చేయడం కోసం ఎంత కష్టపడ్డారో వీడియోలో చూపించారు
అయితే అప్పటి నుండి బుజ్జిని చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకి బుధవారం రోజు ప్రేక్షకుల సమక్షంలో కస్టమ్ మేడ్ వాహనాన్ని హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిగిన కార్యక్రమంలో లాంచ్ చేసారు. ఏకంగా ప్రభాస్ బుజ్జి వాహనంలో కూర్చొని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వేదికపైకి వచ్చారు. సూపర్ హీరో మాదిరిగా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగా , అది చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక బుజ్జికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఆద్యంతం మతి చెడగొట్టే మాయా ప్రపంచం కనిపించిందని చెప్పాలి. సరికొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ సృష్టించబోతున్నాడని గ్లింప్స్ చూస్తే అర్ధమైంది. మహాభారతం సమయం నుంచి కలియుగంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది.
గ్లింప్స్‌లో అధునాతన వాహనాలు, వాటి రూపకల్పన ఆలోచనలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. హాలీవుడ్ లో వచ్చిన చాలా భారీ ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా భారీతనంతో రూపొందుతుందని అర్ధమవుతుంది. బుజ్జి తయారీ కోసం దాదాపు ఏడు కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుండగా, ఇక బుజ్జిని పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్ కోసం మూడు నుండి నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు మేకర్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.