21 వరకు నామినేషన్లు స్వీకరణ
కెకె రాజీనామాతో ఉప ఎన్నిక
సెప్టెంబర్ మూడున పోలింగ్
జనపదం Delhi – హైదరాబాద్ – తెలంగాణ నుంచి రాజ్యసభ ఒకే ఒక స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. బీఆర్‌ఎస్ సభ్యుడు కే కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి ఎన్నికయ్యే వారు 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ పేర్కొన్నది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆగస్టు 27న ప్రకటిస్తారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.