Amulya Gowda | నటీ నటులకు భాషతో సంబంధం లేదు. కేవలం నటనను మాత్రమే చూస్తుంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు మరో భాషాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. తెర ముందు ఎంత అభిమానులను అలరించే నటీనటులకు చెప్పుకోలేని కష్టాలు లేకపోలేదు. ముఖ్యంగా నటీమణులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. సినీ, టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేది క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే ఎంతో మంది నటీమణులు తమకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వెల్లడించారు.
తాజాగా కన్నడ బుల్లితెర నటి అమూల్య గౌడ సైతం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ సినిమా ఆడిషన్స్ కోసం పిలిచి లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి అసభ్యంగా మెసెజ్‌లు పంపినట్లుగా ఆరోపించింది. దీనిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది.
సూర్య అనే వ్యక్తి తనని ఆడిషన్స్‌కి అని పిలిచి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని అమూల్య గౌడ ఆరోపించింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకున్న సూర్య అనే వ్యక్తి తనకు మూవీలో అవకాశం ఇస్తానని నమ్మించాడని చెప్పింది. ఆ తర్వాత వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పంపినట్లు పేర్కొంది. అతడి ప్రవర్తనపై నిలదీస్తే పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అక్షర గౌడ కన్నడతో పాటు తెలుగులోనూ సీరియల్స్‌లో నటిస్తున్నది. తెలుగులో గుండెనిండా గుడి గంటలు అనే సీరియల్‌లో ‘మీనా’ పాత్రను పోసిస్తున్నది.
Good