న్యూఢిల్లీ: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. అయితే సీబీఎస్సీ (CBSE) స్కూల్స్‌లో ఫలితాలు ఇంకా వెలువడలేదు. రిజలట్స్ (Results) ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు సీబీఎస్సీ బోర్డ్ ఓ వార్తను చెవిలో పడేసింది. ఈ నెల 20న పదో తగతి, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.inలో చూసుకోవచ్చని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్సీ స్కూల్స్‌లో పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి రెండు నెలల పాటు అంటే ఏప్రిల్ 2 వరకు జరిగాయి. పరీక్షలో పాసవ్వాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల కోసం విద్యార్థులు ఏం చేయాలంటే..
ఇలా చూసుకోవాలి..
- మొదట సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
- అందులో సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ 2024 లింక్‌పై క్లిక్ చేయాలి
- అనంతరం అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి
- విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను కానీ, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- అప్పుడు పదో తరగతి లేదా 12వ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు.
ఏయే వెబ్‌సైట్లలో
విద్యార్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మరో నాలుగు వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. అవి ఏంటంటే..
cbse.gov.in
cbseresults.nic.in
cbse.nic.in
digilocker.gov.in
results.gov.in