(జనపదం, మేడ్చల్ జిల్లా)
బుల్లితెర నటులు,సెలబ్రెటీల బర్త్ డే పార్టీ రచ్చ
ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి బుల్లితెర నటులు,సెలబ్రెటీల బర్త్ డే పార్టీ అనుమతి లేకుండా జరుగుతుందన్న సమాచారం అందడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక ఎక్సైజ్ పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించారు.
ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ లోని కాంటినెంటల్ రిసార్ట్స్ లో పార్టీ జరిగింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ తో పాటు బిగ్ బాస్ షో ఫేం మహబూబ్ షేక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పార్టీలో 20 మంది కి పైగా సెలబ్రిటీలు, బుల్లితెరనటులు పాల్గొన్నట్లు, అక్రమంగా ఉన్న లిక్కర్ బాటిల్స్ 10 లీటర్లు , బీర్ బాటిల్లు స్వాధీనం చేసుకున్నట్టు, మద్యం అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ చేసుకుంటున్న క్రమంలో రైడ్స్ చేశామని అధికారులు ప్రకటించారు.