Friday, April 4, 2025
HomeTelanganaCEO Vikas Raj | నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి తిరగొద్దు.. నిమిషాల్లోనే చర్యలు:...

CEO Vikas Raj | నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి తిరగొద్దు.. నిమిషాల్లోనే చర్యలు: సీఈఓ వికాస్ రాజ్

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామ‌ని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. భారీ భ‌ద్ర‌తా ఏర్పాలు చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసిందని, 144 సెక్షన్ అమలులోకి వ‌చ్చింద‌న్నారు. న‌లుగురి కంటే ఎక్కు మంది తిర‌గొద్ద‌ని, ఒక‌వేళ అలా తిరిగిన‌ట్ల‌యితే నిమిషాల్లో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. ఎన్నికల పోలింగ్‌కు మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి 160 కంపెనీల సెక్యూరిటీ బలగాలు వస్తున్నాయని, వీరితోపాటు 72వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

  • పోలింగ్ జరిగే రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలిపారు. కొన్ని సంస్థలు మే 13న సెలవు ఇవ్వడం లేదని అని తెలుస్తున్న‌ద‌ని చెప్పారు.
  • రేపు, ఎల్లుండి ప‌త్రిక‌ల్లో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
  • ఈవీఎంల‌ను తరలించే వాహనాలకు జీపీఎస్‌ ఉంటుందని.. సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు రూ.320 కోట్లు సీజ్ చేశామ‌న్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి 8600 ఎఫ్ఐఆర్‌లు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు.
  • 1లక్ష 90వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నారని.. మొత్తం 3లక్షల మంది ఉన్నారని తెలిపారు. వచ్చే 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయన్నారు.
  • 1లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు పోల్ అయ్యాయని తెలిపారు. 21680 మంది ఓటర్లు హోం ఓటింగ్ వేశార‌ని, 1950 నంబర్‌కి ఈసీఐ స్పేస్ ఎపిక్ కార్డు (EPIC) నంబర్ పెడితే ఓటరుకు వివ‌రాలు వస్తాయని పేర్కొన్నారు.
RELATED ARTICLES

తాజా వార్తలు